SKLM: నగరంలో తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడం పారిశుధ్య నిర్వహణను పటిష్టం చేయడమే లక్ష్యంగా జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం సుడిగాలి పర్యటన చేపట్టారు. ఏఎస్ఎన్ కాలనీలోని పంప్ హౌస్‌ను సందర్శించిన ఆయన, అక్కడి నీటి నిల్వలు, సరఫరా తీరును పరిశీలించారు. ప్రజలకు అందుతున్న తాగునీటి నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు.