NTR: నందిగామ మండలం తోటచర్ల హైవేపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్యాంకు ఉద్యోగి మనోహర్ తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న వీరులపాడు కానిస్టేబుల్ శివ వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించి, అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ముండ్లపాడుకు చెందిన మనోహర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన కానిస్టేబుల్‌ను స్థానికులు అభినందించారు.