SDPT: గజ్వేల్ తహశీల్దార్గా పనిచేస్తున్న శ్రావణ్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న పక్కా సమాచారంతోనే ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భారీగా నగదు, కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.