W.G: డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పెనుగొండ SI గంగాధర్ శనివారం హెచ్చరించారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని, అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే తక్షణమే 1930 హెల్ప్ లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారం ఇతరులతో పంచుకోరాదని తెలిపారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోవద్దని హెచ్చరించారు.