కృష్ణా: ఉయ్యూరులోని విజయసాయి పాఠశాలలో విద్యార్థులపై అమానుష ఘటన చోటుచేసుకుంది. క్రమశిక్షణ పాటించలేదని ఆరోపిస్తూ కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థులకు చెప్పుల దండ వేయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.