కోనసీమ: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయ నిత్య అన్నదాన పథకానికి శనివారం హైదరాబాద్ వాస్తవ్యులు భూపతి రాజు అనంత్ ఈషన్ వారి కుటుంబ సభ్యులు రూ.1,00,000 విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి శేష వస్త్రములతో సత్కరించి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.