SRPT: చిలుకూరు మండల పరిధిలోని బేతవోలులో మంగళవారం ‘బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల వివరాలను సేకరించి, విద్యార్థులను మన ఊరి ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులను వివరించారు.