VKB: కొడంగల్‌లో 75% సబ్సిడీపై ప్రభుత్వం రైతులకు పశుగ్రాస విత్తనాలను అందిస్తుంది. 5 కేజీల బ్యాగును 75శాతం సబ్సిడీ పోనూ రూ.128.75కు అందించనున్నట్లు కొడంగల్ పశువైద్య శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ నోహ తెలిపారు. విత్తనాలు కావాల్సిన రైతులు పట్టా పాస్‌బుక్, ఆధార్ కార్డు జిరాక్స్‌ను కొడంగల్ పశువైద్యశాలలో అందించి తీసుకువెళ్లాలని పేర్కొన్నారు.