AP: ‘పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ’పై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ శాఖ పేరును ‘పర్యావరణం, అటవీ శాఖ’గా మార్చింది. అలాగే ‘సైన్స్, టెక్నాలజీ ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్’ అనే కొత్త డిపార్ట్మెంట్ను ఏర్పాటుచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీ. సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.