ATP: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదివారం జేఎన్టీయూ ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఆదేశించారు. ఐసీడీఎస్, డీఆర్డీఏ, మెప్మా శాఖల సమన్వయంతో ఈ వేడుకలు నిర్వహించాలని అన్నారు. అలాగే సహాయక సంఘాలకు సుమారు రూ.1,556 కోట్ల మెగా చెక్కులను, మహిళా రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.