KRNL: మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. కౌతాళంలోని NTR నగర్‌కు చెందిన గోవిందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆదోని కోర్టు శుక్రవారం 7 రోజులు జైలు శిక్ష విధించిందన్నారు. ఇటీవల మద్యం తాగి ఆటో నడిపడంతో అదుపులో తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. ఆదోని ఫస్ట్ అడిషనల్ జడ్జి సాయి సుభాష్ అతడికి 7 రోజులు శిక్ష విధించినట్లు తెలిపారు.