విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 3 నెలలపాటు ఉచిత వెబ్ డెవలపర్ శిక్షణను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కింద జాతీయ, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థల సహకారంతో ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల యువత మార్చి 7లోగా ఆధార్, విద్యా ధ్రువపత్రాలతో కళాశాలలో నమోదు చేసుకోవాలని సూచించారు.