ASF: ఆసిఫాబాద్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలకు చెందిన హర్షిత్, రాష్ట్రపాల్, సంకేత్, కృష్ణ, ఆదర్శ్ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ అబ్దుల్ రహీం తెలిపారు. ఈ నెల 7 నుంచి 9 వరకు మహబూబాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో వారు పాల్గొననున్నారు. ఎంపికైన విద్యార్ధులను ఉపాధ్యాయులు అభినందించారు.