»Priyanka Chopra Says She Eat Alone In Bathroom As A Student In Us Wasnt Allowed To Date By Her Conservative Family
Priyanka Chopra: బాత్రూమ్ లో కూర్చొని లంచ్ చేసేదాన్ని
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra).. హాలీవుడ్ ని దున్నేస్తోంది. అక్కడ వరస అవకాశాలు చేజిక్కించుకొని దూసుకుపోతోంది. చాలా మంది భారతీయ నటులకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రియాంకను రోల్ మోడల్ గా తీసుకొని హాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నవారు చాలా మందే ఉన్నారు. అయితే... అక్కడకు వెళ్లిన మొదట్లో తాను కూడ చాలా కష్టాలు పడినట్లు ప్రియాంక చోప్రా చెప్పడం విశేషం.
అమెరికా వెళ్లిన కొత్తలో చాలా ఇబ్బందులు పడ్డానని ప్రియాంక చోప్రా చెప్పడం గమనార్హం. అక్కడివారితో స్నేహం ఎలా చేయాలో అర్థం కాలేదట. ఆ తర్వాత భయాలన్నీ పక్కనపెట్టి ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. కానీ మొదట్లో భోజనం కూడా బాత్రూమ్ లో చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది.
‘క్యాంటీన్ కి వెళ్లి ఫుడ్ ఎలా తీసుకోవాలో కూడా తెలిసేది కాదు. వెండింగ్ మెషిన్ నుంచి స్నాక్స్ తీసుకొని ఎవరూ చూడకుండా బాత్రూమ్ లో కి తీసుకువెళ్లి తినేదాన్ని. ఆ తర్వాత క్లాస్ రూమ్ కి వెళ్లిపోయేదాన్ని. చాలాకాలం పాటు అక్కడ ఎవరితోనూ కలిసి తిరగలేదు. నాకున్న భయం కారణంగానే అలా చేయాల్సి వచ్చింది. నాలుగు వారాలు అక్కడివి అన్నీ గమనించాను. ఆ తర్వాత భయం పోగొట్టుకొని.. అక్కడివారితో స్నేహం చేయడం మొదలుపెట్టాను. అయితే.. డేట్ కి వెళ్లడం, నైట్ పార్టీలకు మా ఇంట్లో అంగీకరించరని ఫ్రెండ్స్ కి అర్థమయ్యేలా చెప్పాను’ అని ఆమె చెప్పడం గమనార్హం.