Adipurush: నుంచి కృతి సనన్ మోషన్ పోస్టర్…సీత కన్నీరు
ఆదిపురుష్ చిత్రం నుంచి సీత పాత్రలో యాక్ట్ చేస్తున్న కృతి సనన్ మోషన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, సన్నీ సింగ్, సైఫ్ అలీ ఖాన్, దేవదత్తా నాగే కీలక పాత్రలు పోషిస్తున్నారు.
భారత ఇతిహాసాల్లోనే అత్యంత గౌరవించదగిన మహిళా సాథ్వి సీత. ప్రస్తుతం ఆదిపురుష్(Adipurush)తో ప్రభాస్(prabhas), కృతి సనన్(kriti sanon) జంటగా రామాయణ గాథను తెరకెక్కించాడు ఓం రౌత్. సీతా నవమి సందర్బంగా.. అంకితభావం, నిస్వార్థత, శౌర్యం మరియు స్వచ్ఛతకు ప్రతిరూపం జానకి. కృతి సనన్ నటించిన జానకి మంత్రముగ్ధమైన రూపం తో ఉన్న మోషన్ పోస్టర్(motion poster) తో పాటు.. ‘రామ్ సియా రామ్’ ఆడియో టీజర్ ను కూడా విడుదల చేశారు.
జానకి పాత్రలో కృతి సనన్(kriti sanon) స్వచ్ఛత, దైవత్వం మరియు ధైర్యాన్ని రాఘవ్ భార్యగా సూచిస్తుంది. రాం సియా రామ్ ట్యూన్ జానకికి రాఘవ పట్ల ఉన్న అచంచలమైన భక్తిని తెలియజేసేలా ఉంది. ఈ పాట ప్రేక్షకులను ఆధ్యాత్మికత, భక్తి ప్రపంచానికి తీసుకువెళుతుంది. ఈ గీతాన్ని సచేత్-పరంపర స్వరపరిచారు.
ఒక పోస్టర్లో నటి క్లోజ్ అప్ షాట్ ఉంది. మరో పోస్టర్లో హీరో ప్రభాస్(prabhas) బ్యాక్‌డ్రాప్‌లో కనిపిస్తున్నాడు. జానకిగా కృతి సనన్ స్వచ్ఛత, దైవత్వంతో కూడిన భార్యగా కనిపిస్తుంది. జానకి పాత్రలో కృతి కన్విన్స్‌గా కన్పిస్తోంది. రాం సియా రామ్ ట్యూన్ రాఘవ పట్ల జానకి అచంచలమైన భక్తితో ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ క్రమంలో కన్నీరు పెట్టుకున్నట్లు కనిపిస్తున్న చిత్రం ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.
కొత్త పోస్టర్ చూసిన అభిమానులు(fans) “బ్లాక్ బస్టర్ లోడ్ అవుతోంది” అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. “జై మాతా సీతా లేదా జై మాతా కృతి ఏమి చెప్పాలని మరొకరు వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు వచ్చిన మీ పోస్టర్లలో ఉత్తమ పోస్టర్ అని కూడా ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు.
రామాయణం ఆధారంగా ఓం రౌత్ దర్శకత్వం(om rout) వహించిన ఆదిపురుష్ చిత్రంలో రాఘవగా ప్రభాస్, జానకిగా కృతి సనన్, శేష్‌గా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్తా నాగే నటించారు. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ లంకేష్ విలన్‌గా కూడా నటిస్తున్నారు.
అంతకుముందు అక్షయ తృతీయ పవిత్రమైన సందర్భంగా ఆదిపురుష్ బృందం ‘జై శ్రీ రామ్’ లిరికల్ ఆడియో క్లిప్‌ను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదల చేసింది.
టి-సిరీస్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫైల్స్ రాజేష్ నాయర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 16, 2023న విడుదల కానుంది.