»Jee Main 2023 Telangana Student Gets Number One Rank In Jee Main 2023 Session 2 Results
JEE Main Session 2లో తెలంగాణ విద్యార్థికి నంబర్ వన్ ర్యాంక్
జేఈఈ మెయిన్-2023 సెషన్ -2 ఫలితాల్లో హైదరాబాద్ కు చెందిన సింగారపు వెంకట్ కౌండిన్య మొదటి ర్యాంకుతో సాధించి సత్తా చాటాడు. టాప్ టెన్ ర్యాంకుల్లో నాలుగు ర్యాంకులు మన తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే సొంతం చేసుకున్నారు.
దేశంలో తెలంగాణ (Telangana) విద్యార్థులు సత్తా చాటుతున్నారు. తాజాగా విడుదలైన జేఈఈ మెయిన్-2023 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థి నంబర్ వన్ ర్యాంక్ సాధించాడు. శనివారం విడుదలైన జేఈఈ మెయిన్-2023 సెషన్ -2 (JEE Main 2023 Session 2 Results) ఫలితాల్లో హైదరాబాద్ (Hyderabad)కు చెందిన సింగారపు వెంకట్ కౌండిన్య (Singarapu Venkat Koundinya) మొదటి ర్యాంకుతో సాధించి సత్తా చాటాడు. టాప్ టెన్ ర్యాంకుల్లో నాలుగు ర్యాంకులు మన తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే సొంతం చేసుకున్నారు.
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో (Engineering Course) ప్రవేశం కోసం జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2023 సెషన్-2 పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పరీక్షలకు 9.40 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో హైదరాబాద్ కు చెందిన వెంకట్ కౌండిన్య 300/300 మార్కులు స్కోర్ (Score) చేసి సత్తా చాటాడు. పాఠశాల నుంచి ఇంటర్ వరకు కౌండిన్య శ్రీచైతన్య విద్యా సంస్థల్లోనే చదివాడు. జూన్ 4వ తేదీన జరిగే జేఈఈ అడ్వాన్స్ డ్ (JEE Advanced)లో ఉత్తమ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో (IIT Bombay) బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతానని కౌండిన్య తెలిపాడు.
ఇక టాప్ టెన్ లో రెండో ర్యాంకును ఏపీలోని నెల్లూరు జిల్లాకు (Nellore District) చెందిన పి లోహిత్ ఆదిత్య సాయి దక్కించుకున్నాడు. మరో హైదరాబాద్ విద్యార్థి సాయి దుర్గారెడ్డి 6వ ర్యాంక్ సాధించగా.. ఏపీలోని అమలాపురం (Amalapuram) విద్యార్థి కె.సాయినాథ్ శ్రీమంత 10వ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. తమ పిల్లలు ఉత్తమ ర్యాంకులు సాధించడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల కోసం విద్యార్థులు ఎన్ టీఏ అధికారిక వెబ్ సైట్ https://jeemain.nta.nic.in/లో చూడవచ్చు.
30 నుంచి అడ్వాన్స్ డ్ రిజిస్ట్రేషన్లు
జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షకు ఈనెల 30వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. మే 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అదే నెల 29 నుంచి జూన్ 4వ తేదీవరకు అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఇస్తారు. ఇక జూన్ 4వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు.