»Health Tips Amazing Profits With Ragi Kharjuram Java In Summer
Health Tips: వేసవిలో ‘రాగి ఖర్జూరం జావ’తో అద్భుత లాభాలు
రాగి ఖర్జూరం జావలో ఐరన్(Iron), కాల్షియం(Calcium) పుష్కలంగా ఉంది. అనేక పోషక విలువలున్న ఈ రాగి జావ రోగనిరోధక శక్తి(Immunity)ని పెంచుతుంది. షుగర్ పేషెంట్ల నుంచి పిల్లలు, పెద్దల వరకూ కూడా ఈ రాగి ఖర్జూరం జావ మంచి ఔషధంలాగా పనిచేస్తుంది.
వేసవి(Summer)లో రాగి ఖర్జూరం జావతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పూర్వకాలం ఎక్కువగా ఈ రాగి ఖర్జూరం జావను సేవించేవారు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల దగ్గరి నుంచి సామాన్యుల వరకూ కూడా తృణధాన్యాలను ఆహారంగా తీసుకుంటూ ఉన్నారు. చిరుధాన్యాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాగులు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగులలో కాల్షియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ వంటివి శరీరానికి శక్తిని ఇస్తాయి.
విటమిన్ బి, ఐరన్ వంటివి రాగుల నుంచి పుష్కలంగా లభిస్తాయి. ఎముకల(Bones) ధృడత్వానికి, రక్తహీనతకు రాగులు సూపర్ ఫుడ్ లాగా పనిచేస్తాయి. వేసవిలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి రాగి జావ ఎంతగానో ఉపయోగపడుతుంది. రాగిపిండిలో ఖర్జూరం వేసి జావ చేసుకుని తాగితే అద్భుతమైన శక్తి లభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
రాగి ఖర్జూరం జావలో ఐరన్(Iron), కాల్షియం(Calcium) పుష్కలంగా ఉంది. అనేక పోషక విలువలున్న ఈ రాగి జావ రోగనిరోధక శక్తి(Immunity)ని పెంచుతుంది. షుగర్ పేషెంట్ల నుంచి పిల్లలు, పెద్దల వరకూ కూడా ఈ రాగి ఖర్జూరం జావ మంచి ఔషధంలాగా పనిచేస్తుంది. వేసవి తాపం నుంచి రక్షిస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. పిల్లల ఎదుగుదలకు సహాయపడుతుంది.