కృష్ణా: గుడివాడ బస్టాండ్లో టూ టౌన్ సీఐ హనీశ్ కుమార్ ప్రయాణికులకు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బస్టాండ్లో ఉండే ప్రయాణికులు, మహిళలు, వృద్ధులతో మాట్లాడి, తమ వద్ద ఉన్న విలువైన వస్తువులు, నగలు, సెల్ ఫోన్లు జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. బస్టాండ్లోని రద్దీ ప్రదేశాలలో దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో అప్రమత్తంగా ఉండాలన్నారు.