Tadipatri mla kethireddy pedda reddy made sensational comments
kethireddy pedda reddy:తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (kethireddy pedda reddy) సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ను (jagan) నమ్ముకున్న వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కార్యకర్తలను విస్మరిస్తే బాగోదేని.. నాశనం అయిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మండల కేంద్రాల్లో పనిచేస్తోన్న అధికారులు సరిగ్గా ప్రవర్తించడం లేదంటున్నారు. వీరి అసమర్థత వల్ల గ్రామాల్లో కక్షలకు కారణం అవుతుందని చెప్పారు. తనకు అధికారం శాశ్వతం కాదని.. కార్యకర్తలను రక్షించుకునేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తానని స్పష్టంచేశారు. మన కోసం పనిచేసిన వారికి ఏమైనా చేయాలనే ఉండాలని గుర్తుచేశారు. సర్వం పోగొట్టుకున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు.
శింగనమల నియోజకవర్గంలో గల యల్లనూరులో అటివిక రాజ్యం సాగుతోందని పెద్దారెడ్డి (pedda reddy) మండిపడ్డారు. ఇక్కడ 18 ఫ్యాక్షన్ గ్రామాలు (18 villages) ఉన్నాయని.. ఒక్క చోట ఫ్యాక్షన్ ప్రారంభమైనా.. తిరిగి విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దళిత మహిళ ఎంపీపీ (sc lady mpp) అయితే.. ఆమెను పరిగణనలోకి తీసుకోలేదని పెద్దారెడ్డి గుర్తుచేశారు. ఇదీ నియంత పాలనా అని అడిగారు. గ్రామాలు ఎలా ఉన్నాయి..? మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామనేది ఆలోచించాలని కోరారు.
వచ్చే ఎన్నికల్లో 50 నుంచి 60 మంది సిట్టింగులకు టికెట్ల ఇవ్వబోనని సీఎం జగన్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఆ జాబితాలో ఎవరున్నారో అధికారికంగా తెలియదు. కానీ ఒక్కో నేత మాత్రం సీఎం జగన్, వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. ఆ జాబితాలో పెద్దారెడ్డి కూడా చేరిపోయారు.