బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో మూవీ చేయనున్నట్లు సమాచారం. దిల్ రాజు నిర్మించే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్ 2026లో ప్రారంభం కానుందట. ఇందులో సల్మాన్ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నాడట. మరోవైపు రాజ్ & డీకే దర్శకత్వంలో రిటైరింగ్ సూపర్ హీరోగా ఓ చిత్రానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు, ఇది నవంబర్ 2026న పట్టాలెక్కనున్నట్లు టాక్.