సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ ఆదేశాలతో 99 రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు కాలనీల్లో నిలిచిన డ్రైనేజీలను క్లీన్ చేస్తూ, ప్రధాన రహదారులపై ఉన్న మట్టిని తొలగిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.