ములుగు జిల్లా లక్నవరం సరస్సు పరిసరాల్లో నేటి నుంచి ఈ నెల 28 వరకు ప్రతి శనివారం నైట్ క్యాంపింగ్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకు టెంట్లలో బస, సంగీతం, ప్రకృతి వీక్షణ, సూర్యోదయం ఆస్వాదన వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పర్యాటకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.