NLG: చిట్యాల మండలం సుంకెనెపల్లికి చెందిన అన్నదమ్ములు విక్రమసింహా రెడ్డి, విజయసింహా రెడ్డి సివిల్స్‌లో సత్తా చాటారు. ఫలితాల్లో విక్రమసింహారెడ్డి 541వ ర్యాంకు, విజయసింహారెడ్డి 682వ ర్యాంకు సాధించారు. వీరి తండ్రి అంజిరెడ్డి ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి కాగా, తల్లి అలివేలు గృహిణి. ప్రస్తుతం వీరు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎంపీడీవోలుగా పనిచేస్తున్నారు.