NLR: కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఓగూరులో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కందుకూరు టీడీపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు.