టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ నటించిన ఏజెంట్(agent movie) ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో ఈ చిత్రం ట్విట్టర్ రివ్యూ(twitter review) ఏంటో తెలుసుకుందాం.
సురేందర్ రెడ్డి(surender reddy) దర్శకత్వంలో అఖిల్ అక్కినేని(akhil akkineni) నటించిన ఏజెంట్(Agent) మూవీ భారీ అంచనాల నడుమ ఈరోజు(ఏప్రిల్ 28న) విడుదలైంది. ఈ సినిమాను స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. సాక్షి వైధ్య హీరోయిన్గా యాక్ట్ చేసింది. అయితే ఈ చిత్రాన్ని ప్రీమియర్ షోల ద్వారా చూసిన ప్రేక్షకులు ఈ సినిమా గురించి వారి అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ క్రమంలో ట్విట్టర్ టాక్ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
Agent ఓవరాల్ గా ఒక బిలో యావరేజ్ స్పై యాక్షన్ ఫిల్మ్ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. కొన్ని సీన్స్ మినహా ఈ చిత్రంలో దాదాపు అన్నీ బాలేవని చెప్పుకొచ్చాడు. స్టుపిడ్ విలన్ పాత్రతో స్టోరీ కూడా చాలా బలహీనంగా ఉందని, పాటలు, బీజీఎమ్ దారుణంగా ఉన్నాయని తెలిపారు.
అఖిల్ వన్ మ్యాన్ షో, మంచి విరామం తప్ప చెప్పుకోదగ్గది ఏమీ లేదని ఇంకో వ్యక్తి తెలిపాడు. రొటీన్ పాటలు, బిజిఎమ్ మైనస్ అని అంటున్నారు. అలాగే, హీరోయిన్‌కి లిప్ సింక్ లేదని, ఆమె సన్నివేశాలు బోరింగ్‌గా ఉన్నాయని చెబుతున్నారు. ఇంకా పలువురు ఏం చెప్పారో ఈ ట్వీట్లపై ఓ లుక్కేయండి మరి.
#Agent Overall A Below Par and Clumsy Spy Action Film!
Apart from a few blocks, almost everything else with this film goes wrong. The writing itself is very weak along with a stupid villain character. The songs/bgm are atrocious. Surrender Reddys weakest work