PLD: సత్తెనపల్లి మండలంలోని దూళిపాళ్ల గ్రామంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న గాడపాటి ఏలియా అనే వ్యక్తిని గుర్తుతెలియని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏలియా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.