NRPT: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ధన్వాడ మండలం మందిపల్లి గ్రామంలో మహిళా సంఘం సభ్యులను సర్పంచ్ సురేందర్ రెడ్డి సన్మానించారు. పంచాయతీ కార్యదర్శి జ్యోతిని శాలువాతో ఘనంగా సత్కరించారు. మహిళలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నరేష్, గ్రామస్థులు పాల్గొన్నారు.