Jagadish Reddy: రాయల తెలంగాణపై మంత్రి జగదీష్ కీలక వ్యాఖ్య
కేసీఆర్(KCR) నాయకత్వంతోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ కల సాకారమని.. రాయల తెలంగాణ అంశం వదిలి ఆ దిశగా ఆంధ్ర ప్రజలు ఆలోచించాలని కోరారు. అక్కడ ప్రభుత్వాల వైఫల్యాలతోనే రాయల తెలంగాణ అంశం తెర మీదకు వచ్చిందన్నారు.
Jagadish Reddy: తెలంగాణ ఉద్యమ సమయంలో ‘రాయల తెలంగాణ'(Rayala Telangana) అంశం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు రాయలసీమ(Rayalaseema)లోని అనంతపురం జిల్లా(Anantapuram) సీనియర్ రాజకీయ నేత జేసీ దివాకర్ రెడ్డి(JC DewakarReddy) రాయల తెలంగాణపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను తెలంగాణలో కలపాలని.. అపుడే రాయల సీమ సాగునీటి సమస్య తీరుతుందని జేసీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు రాయల తెలంగాణ అంశం రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయింది.
తాజాగా రాయల తెలంగాణ అంశంపై మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) స్పందించారు. కేసీఆర్(KCR) నాయకత్వంతోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ కల సాకారమని.. రాయల తెలంగాణ అంశం వదిలి ఆ దిశగా ఆంధ్ర ప్రజలు ఆలోచించాలని కోరారు. అక్కడ ప్రభుత్వాల వైఫల్యాలతోనే రాయల తెలంగాణ అంశం తెర మీదకు వచ్చిందన్నారు. ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణ ఇప్పుడు సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణ ఇప్పుడు సాధ్యం కాదన్నారు. తెలంగాణలో కలపాలని తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు కోరడం కేసీఆర్ అభివృద్ధికి నిదర్శనమన్నారు.
ఇది ఇలా ఉంటే.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి(Byreddy Rajasekhar Reddy) అసహనం వ్యక్తం చేశారు. రాయలసీమపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. రాయలసీమ అభివృద్ధిపై కేంద్రానికి, ప్రధాని మోడీకి ఎన్నో లేఖలు రాశామన్నారు. జేసీ దివాకర్ రెడ్డి(JC Diwakar Reddy) లేవనెత్తిన రాయల తెలంగాణ డిమాండ్‌ను ఖండిస్తున్నట్లు ప్రకటించారు. రాయలసీమను విడదీయడం ఎవరి తరం కాదని అన్నారు.