తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో మంగళవారం రోజు కూలీలతో వెళ్తున్న ఆటోరిక్షాను కారు ఢీకొట్టింది. దీంతో ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. ఏన్కూరు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
మరోవైపు గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతులను కల్లూరుకు చెందిన వరమ్మ, వెంకటమ్మగా గుర్తించారు. కల్లూరుకు చెందిన కూలీలు ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామంలో వ్యవసాయ పొలంలో పనులకు కోసం వెళ్తున్న క్రమంలో యాక్సిడెంట్ జరిగింది. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందించినా కూడా అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో స్థానికులు తమ వాహనాల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.