సత్యసాయి: పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఖిద్మత్ ఎ ఖల్క్ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది. ట్రస్ట్ నిర్వాహకులు షామీర్ ఆధ్వర్యంలో 70 మంది పదో తరగతి విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్లు, పెన్నులు, స్కేళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయుడు జాకబ్, ఇన్ఛార్జ్ ఉపాధ్యాయుడు రమణ చేతుల మీదుగా ఈ సామాగ్రిని అందజేశారు.