NLG: అన్ని రంగాల్లో రాణిస్తూ నేటి మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారు. చిట్యాల మండలంలో మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మున్సిపల్ పాలకవర్గంలో సగం మంది మహిళలే ఉండగా.. తహసీల్దార్, ఎంపీడీవో, ఏపీవోలుగా మహిళా అధికారులే సమర్థవంతంగా విధులను నిర్వహిస్తున్నారు. మండలంలోని 18 గ్రామాల్లో 9 మంది మహిళా సర్పంచులు పాలన అందిస్తున్నారు.