Sai dharam teja:విరూపాక్ష (virupaksha) మూవీ హిట్ టాక్‌తో హీరో సాయి ధరమ్ తేజ్ (Sai dharam teja) జోష్‌లో ఉన్నాడు. #AskSDT పేరుతో ఫ్యాన్స్’ తో ఈ రోజు ఇంటరాక్ట్ అయ్యాడు. అభిమానులు పలు ప్రశ్నలు వేయగా.. ధరమ్ తేజ (teja) తడుముకోకుండా సమాధానం ఇచ్చారు.
సెలబ్రిటీ క్రష్ గురించి ఓ అభిమాని అడగారు. తేజ (teja).. వెంటనే సమంత అని చెప్పేశాడు. మరో నెటిజన్ విరూపాక్ష (virupaksha) సినిమాను అన్నీ భాషల్లో రిలీజ్ చేయాలని కోరాడు. ఇంట గెలిచి రచ్చ గెలుద్దాం అని సమాధానం ఇచ్చాడు. త్వరలో అన్ని భాషల్లో విడుదల చేస్తామని పేర్కొన్నాడు. దీంతో అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు.
విరూపాక్ష సెకండ్ పార్ట్ (second part) కూడా ఉంటుందని తేజ్ క్లారిటీ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత తేజ్‌కు హిట్ దక్కింది. యాక్సిడెంట్ తర్వాత చేసిన ఫస్ట్ మూవీ ఇదే కాగా.. మంచి హిట్ అయ్యింది.
సమంత- చైతన్య విడిపోయిన నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఇద్దరికీ సంబంధించి ఏదో ఒక విషయంలో చర్చ జరుగుతుంది. ఈ రోజు తేజ్‌కు అభిమాని నుంచి ప్రశ్న రాగా.. సమాధానం ఇచ్చారు. మరీ దీనిపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలీ.