»Telangana Mallu Bhatti Vikramarka Fire On Amit Shah Reservation Statements
మత కల్లోలాలు సృష్టించేందుకు BJP కుట్ర..: అమిత్ షాపై భట్టి విక్రమార్క ఆగ్రహం
భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడడం బాధాకరం. రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటుతో ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది. రాజ్యాంగం ఇచ్చిన వాటిని తొలగిస్తానని ఒక కేంద్ర మంత్రి చెప్పడం దారుణం.
మైనార్టీల రిజర్వేషన్లు (Muslim Reservations) రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్ర నాయకుడు అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నారు. ఆయన ప్రకటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో మత కల్లోలాలు (Religious Riots) రేపేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని.. ఇంకా మత రాజకీయాలు (Religious Politics) చేయడం దారుణమని పేర్కొంటున్నారు. గోద్రా అల్లర్లతో (Godra Riots) వందలాది మంది చావులకు నరేంద్ర మోదీ (Narendra Modi) కారణంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు రిజర్వేషన్లు రద్దు చేసి మరిన్ని అల్లర్లు సృష్టించి 2024 ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కుట్ర, కుఠిల రాజకీయాలకు తెరలేపారని మండిపడుతున్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka), బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తప్పుబట్టారు.
పీపుల్స్ మార్చ్ (Peoples March)లో భాగంగా సోమవారం భట్టి విక్రమార్క హన్మకొండ జిల్లా (Hanumakonda District) కమలాపూర్ (Kamalapur)లో పర్యటించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను భట్టి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించారు. ‘ప్రశాంతంగా ఉన్న దేశంలో మతకల్లోలం సృష్టించడానికి బీజేపీ కుట్రలు చేస్తోంది. ముస్లిం రిజర్వేషన్లపై ఆయన చేసిన ప్రకటనతో మతకల్లోలాలకు దారి తీసే ప్రమాదం పొంచి ఉంది. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడడం బాధాకరం. రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటుతో ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది. రాజ్యాంగం ఇచ్చిన వాటిని తొలగిస్తానని ఒక కేంద్ర మంత్రి చెప్పడం దారుణం. అది రాజ్యాంగ ఉల్లంఘనకే దారి తీస్తుంది. ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రశాంతంగా ఉన్న దేశంతోపాటు తెలంగాణలో అల్లర్లు సృష్టించే కుట్రలు చేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వారి ఆటలు సాగవు’ అని హెచ్చరించారు.
ఇక పంట నష్టంపై స్పందిస్తూ సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సరైన సమయంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి ఉంటే పంట నష్టం జరిగి ఉండేది కాదు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తాం అంటున్నారు కానీ క్షేత్రస్థాయిలో అధికారులు రాలేదు. మొక్కజొన్న గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. మార్క్ ఫెడ్ నుంచి కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులకు నష్టం జరుగుతోంది’ అని భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు.