కడప పార్లమెంటు సభ్యులు అవినాశ్ రెడ్డి (kadapa mp avinash reddy), ఆయన కుటుంబ సభ్యులు తన పైన కక్ష కట్టారని దస్తగిరి (dastagiri) ఆవేదన వ్యక్తం చేశాడు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (ys vivekananda reddy murder case) దస్తగిరి అప్రూవర్ గా (dastagiri) మారిన విషయం తెలిసిందే. ఈ మేరకు కడప ఎస్పీ కార్యాలయంలో (kadapa sp office) ఆయన ఫిర్యాదు చేశాడు. పులివెందుల వైసీపీ కేడర్ (pulivendula ycp cadre), అవినాశ్ రెడ్డి అనుచరుల (avinash reddy) నుండి తనకు ప్రాణ హానీ ఉందన్నాడు. తనను, తన కుటుంబాన్ని వారు ఏమైనా చేస్తారేమోననే భయం ఉందని చెప్పాడు. తనను అవినాశ్ అనుచరులు అనుసరిస్తున్నారని, వారు తన పైన బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారని చెప్పాడు. తనకు, తన కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. ఇదిలా ఉండగా, వివేకా హత్యకేసులో (viveka murder case) దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. ఇటీవల కూడా ఆయన తనకు వారితో ప్రాణ హానీ ఉందని అందోళన వ్యక్తం చేశాడు. సీఎం జగన్, ఎంపీ అవినాష్‌తో తనకు ప్రమాదం పొంచి ఉందని చెప్పాడు.
తాను అప్రూవర్ గా మారే సమయంలో అవినాశ్ తనను ఎందుకు ప్రశ్నించలేదని, ఇప్పుడు ఎందుకు టార్గెట్ చేశారని ప్రశ్నించాడు. ఈ కేసు వారి వరకు రానంతవరకు తాను మంచివాడిగా ఉన్నానని, ఇప్పుడు వారి వరకు వచ్చేసరికి చెడ్డవాడిని అయ్యానన్నాడు. వివేకానంద కూతురు సునీత, సీబీఐ నుంచి తాను రూపాయి తీసుకోలేదని చెప్పాడు. అసలు తాను మొదట డబ్బుకు ఆశపడి ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లు చేశానని, ఇప్పుడు తనకు ఆ అవసరం లేదు కాబట్టి సీబీఐకి నిజం చెప్పానన్నాడు. పలుకుబడి ఉందని సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌ను కూడా ఇక్కడి నుండి మార్చారని ఆరోపించాడు. గతంలో తప్పు చేశా కాబట్టి ప్రాయశ్చితం చేసుకుంటున్నట్లు చెప్పాడు. వారు తప్పు చేసినట్టు రుజువైతే రాజీనామా చేస్తారా అని జగన్, అవినాష్‌కు సవాల్ చేశారు.