GNTR: పొన్నూరులో వల్లంశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో గురువారం జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.