టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం తర్వాత మొదటిసారి విజయ్ అమ్మమ్మ ఊరికి వెళ్లారు. అక్కడ విజయ్ తన తాతయ్య గోపాల్ రావు, అమ్మమ్మ ప్రమీల సమాధుల వద్ద భార్య రష్మికతో కలిసి నివాళులర్పించి, ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం బంధువుల ఇళ్లకు వెళ్లి పెద్దల దీవెనలు పొందారు. వీరి ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.