NZB: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, NZB మాజీ MP కల్వకుంట్ల కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తన కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి గురువారం బయలుదేరి వెళ్లారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు వెళ్లి శుక్రవారం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు.