»Minister Adimulapu Suresh Hot Comments On Bhaskar Reddys Arrest
Minister Suresh: వైయస్ భాస్కర రెడ్డి అరెస్ట్‌పై మాటమార్చిన మంత్రి సురేష్
వైయస్ భాస్కర రెడ్డి అరెస్టుపై మంత్రి ఆదిమూలపు సురేష్ కొద్ది గంటల్లోనే మాట మార్చారు. తొలుత చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ఆయన ఆ తర్వాత మాత్రం భాస్కర్ రెడ్డి అరెస్ట్ ను ఖండించారు.
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (ys vivekandanda reddy murder case) కడప ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి (mp avinash reddy) తండ్రి వైయస్ భాస్కర రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడంపై మంత్రి ఆదిమూలపు సురేష్ (minister adimulapu suresh) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ అరెస్టుపై మీడియా ఆయన స్పందన కోరగా… చట్టం తన పని తాను చేసుకుపోతుందని తొలుత చెప్పిన మంత్రి.. ఆ తర్వాత తన మాటలు వక్రీకరించారని వ్యాఖ్యానించారు. మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం పైన ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశానికి మంత్రి సురేష్ హాజరయ్యారు (minister suresh). ఈ సందర్భంగా భాస్కర రెడ్డి (bhaskar reddy) అరెస్ట్ విషయంలో మీ స్పందన తెలియజేయాలని మీడియా అడిగింది. దీనికి మంత్రి స్పందిస్తూ… చట్టం తన పని తాను చేసుకుపోతుందని, కేసులో సీబీఐ దర్యాఫ్తును (cbi investigation) కోరిందే జగన్ మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) అనే విషయం గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆయన ఒంగోలులో తన క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.
మంత్రి చేసిన వ్యాఖ్యలు మీడియాలో వచ్చాయి. భాస్కర్ రెడ్డి అరెస్టుపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి చెప్పినట్లు వచ్చింది. ఇది మీడియాలో వచ్చిన తర్వాత… ఆయన కొంతమంది మీడియా ప్రతినిధులను కార్యాలయానికి ఆహవానించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రసారం చేయడం సరికాదని, ఇది బాధాకరమన్నారు. భాస్కర రెడ్డి వంటి అమాయకులను అరెస్ట్ చేయడం సరికాదని, తాను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.
కాగా, వైయస్ వివేకా హత్య కేసులో సీబీఐ… భాస్కర్ రెడ్డిని (72) అరెస్ట్ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు చేసింది. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో దర్యాప్తు సంస్థ అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించింది. అంతకుముందు ఏడు గంటల వరకు భాస్కర్ రెడ్డిని విచారించారు. అనంతరం ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు మెమో జారీ చేశారు. పులివెందుల బాకారంలోని భాస్కర రెడ్డి నివాసానికి ఉదయమే సీబీఐ బృందం చేరుకొని, తొలుత సోదాలు నిర్వహించింది. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నది. వివేకా హత్య, నేరపూరిత కుట్ర, ఆధారాల ధ్వంసం తదితర అభియోగాల కింద నమోదైన కేసులో అరెస్ట్ చేసింది. 120బీ రెడ్ విత్ 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి భాస్కర్ రెడ్డి రెండు సెల్ఫోన్లు సీజ్ చేశారు. ఒకటి ఫ్లైట్ మోడ్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత అతనిని పులివెందుల నుండి హైదరాబాద్ తరలించి, జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఆయన భార్య లక్ష్మికి మెమోను అందించారు. భాస్కర రెడ్డి కడప ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి తండ్రి. సీఎం జగన్ కు చిన్నాన్న. వైయస్ భారతికి సొంత మేనమామ.