JGL: తెలంగాణ రాష్ట్రంలోని పేదవారికి గూడు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామానికి చెందిన కొత్తపల్లి లింగం ప్రణీత దంపతుల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం సందర్భంగా గురువారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరై వారికీ శుభాకాంక్షలు తెలిపారు.