TG: నిజామాబాద్ జిల్లా ఆలూర్కు చెందిన మల్లయ్య మస్కట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు ఆయన్ని ఢీకొట్టింది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన మల్లయ్య మరణవార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కష్టార్జితంతో కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్న వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.