SRPT: సూర్యాపేట జిల్లాలోని 3,55,057 రేషన్ కార్డుదారులకు ఏప్రిల్, మే, జూన్ నెలల కోటాను ఏప్రిల్లోనే పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. గోదాముల్లో నిల్వలు పెరగడం, వేసవి దృష్ట్యా ఈ ముందస్తు పంపిణీకి ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని 610 రేషన్ షాపుల ద్వారా నెలకు 6 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ కానుంది.