AP: కేసీ కెనాల్ 31.90 టీఎంసీలు నంద్యాల, కడప, కర్నూలు జిల్లాలకు ఇవ్వాలని మంత్రి నిమ్మల వెల్లడించారు. మొత్తం 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని తెలిపారు. 49,200 ఎకరాలకు ఆళ్లగడ్డ పరిధిలో నీరు ఇవ్వాల్సి ఉందన్నారు. ఖరీఫ్, రబీకి కలిపి 80 వేల ఎకరాలకు పైగా ఈ ఏడాది నీరిచ్చినట్లు చెప్పారు. కుందూనదిపై హరివరం ఎత్తిపోతలపై నీటిపారుదలశాఖ ద్వారా ప్రతిపాదనలు పంపిస్తామని పేర్కొన్నారు.