TG: హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ. 350 కోట్లు కేటాయిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్రమంత్రి.. ప్రజా రవాణాను మరింత పెంచాలన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రయాణికుల సంఖ్య ఎంతపెరిగినా.. వసతులు ఉండేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు.