ADB: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 8న ఆదిలాబాద్‌లోని కొమురం భీం కాలనీలో తుడుం దెబ్బ మహిళా సంఘం నిర్వహించే కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. గురువారం సంఘం నేతలు ఆయనను కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు గణేశ్, మనోజ్, తదితరులు పాల్గన్నారు.