AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటనపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కీలక వివరాలు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 28కి చేరిందని ఆయన తెలిపారు. కాగా, ప్రధాన నిందితులైన అర్జున్, నానిల కోసం పోలీసులు గాలిస్తున్నారని పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఈ కేసుకు సంబంధించి సామర్ల కోట వద్ద ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు చెప్పారు.