AP: పదో తరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థుల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తమ అధికారిక సైట్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచింది. విద్యార్థులు మనమిత్ర వాట్సాప్ నంబర్(9552300009) లేదా లీప్(LEAP) ద్వారా కూడా పొందవచ్చు. కాగా పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి.