MNCL: భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా భక్తుల కోసం తపాల శాఖ ద్వారా తలంబ్రాలు నేరుగా ఇంటికి అందిస్తామని బెల్లంపల్లి సబ్ డివిజన్ తపాలా శాఖ అధికారి విక్రమ్ గురువారం పేర్కొన్నారు. ఈనెల 27వ తేదీ వరకు రూ.450 చెల్లించిన వారికి అంతరాలయ అర్చన,10గ్రాముల కల్యాణ తలంబ్రాలు, ఒక ముత్యం, పసుపు, కుంకుమ, రూ. 151 చెల్లిస్తే ముత్యాల తలంబ్రాలు అందిస్తామన్నారు.