అన్నమయ్య: చిన్నమండ్యం మండలం దిగువ గొట్టివీడు గ్రామంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ నాయకులు ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ మాట్లాడుతూ.. వెలిగల్లు ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా మాధవరం, దిగువ గొట్టివీడు, గొర్లమదీడు, ఎగువ గొట్టివీడు, గోరంచెరువు గ్రామాల చెరువులు, కుంటలకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.