TG: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉద్యోగులు ఇవాళ నిరవధిక సమ్మెకు దిగనున్నారు. పెండింగ్ OT బకాయిలు, గ్రౌండ్ సిబ్బంది కన్వేయన్స్ అలవెన్సులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే HR కన్సల్టెన్సీ నియామక ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని కోరారు. గతంలో 3 నెలలపాటు జీతాలు లేకపోయినా అంకితభావంతో పనిచేశామని, అందరికీ క్యాష్‌లెస్ ఆరోగ్య బీమా కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.