BDK: మణుగూరు 100 పడకల ఆసుపత్రిని గురువారం జిల్లా కలెక్టర్ అంకిత్ సందర్శించారు. రోగులకు మందులు పంపిణీని, కంటి పరీక్షల విభాగ గదిని, రక్తపరీక్ష కేంద్రాలని, మహిళలు ప్రసవించి విశ్రాంతి తీసుకుంటున్న గదులను సాధారణ వైద్యం అందుకుంటున్న రోగులను కలెక్టర్ పరిశీలించారు. వారి ఆరోగ్య విషయాలతో పాటు వైద్యుల పనితీరును అడిగి తెలుసుకున్నారు.